English | Telugu
సంపూర్ణేష్ బాబు హృదయం చాలా పెద్దది సుమీ..!
Updated : Mar 19, 2016
సంపూర్ణేష్ బాబు ఒక కామెడీ హీరోగానే అందరికీ తెలుసు. కానీ అతనిలో మంచి మానవతా వాది కూడా ఉన్నాడు. ఇప్పటికే చాలాసార్లు వీలైనంత మందికి సాయం చేశాడు సంపూ. కానీ అవి పెద్దగా బయటికి చెప్పుకోడు. చెన్నైవరదలు వచ్చినప్పుడు, హుదూధ్ తుఫాన్ తో వైజాగ్ విలవిల్లాడినప్పుడు కూడా భారీగానే విరాళాన్ని ఇచ్చాడు. లేటెస్ట్ గా వెస్ట్ గోదావరి లో అరటికట్ల గ్రామంలో కొబ్బరి మట్ట షూటింగ్ లో ఉన్న సంపూ, ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలను సందర్శించాడు. పిల్లలతో మాట్లాడుతూ, వాళ్లు బాగా చదువుకోవాలని, టాంప్ ర్యాంక్ సాధించిన వాళ్లలో అబ్బాయికి పదివేలు, అమ్మాయైతే పదిహేనువేలు ఇస్తానని వాళ్లకు హామీ ఇచ్చాడు. బాగా చదువుకుని దేశానికి, తల్లిదండ్రులు గర్వకారణంగా నిలవాలని వాళ్లకు సూచించాడు. ఈ విషయం తెలిసిన వారంతా, ఈ కొబ్బరి మట్టలో ఇంత మంచి మనసుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీలో చాలామందికి ఇప్పుడు సంపూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. తన మంచిమనసుతో అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు.