English | Telugu
2023లో ప్రభాస్ ఫస్ట్ విషెష్ ఎవరికో తెలుసా!
Updated : Jan 2, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2023 సాలిడ్‌గా సినిమాలతో ప్రభంజనం క్రియేట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆది పురుష్ లైన్‌లో ఉంది. మరో వైపు సలార్, ప్రాజెక్ట్ K చిత్రాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. అలాగే మారుతి సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా జరిగిపోతుంది. ఈ నాలుగు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ ఓ రేంజ్ వైబ్స్ క్రియేట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ తన స్టైల్ మార్చుకుంటున్నారు. సాధారణంగా ఆయనకు మొహమాటం ఎక్కువ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొహమాట పడితే పక్కనుండి పోవాల్సి వస్తుంది. కాబట్టి.. ప్రభాస్ తన రూట్ మార్చుకుని ముందు కెళుతున్నారు. మనుషులతో ఎక్కువగా కలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవుతున్నారు మన డార్లింగ్.
ఇంతకీ న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా మొదటిగా ఎవరికీ విషెష్ చెప్పారో తెలుసా! బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌భీర్ కపూర్‌కి. ఇంతకీ మన రెబల్ స్టార్ .. రణ్‌భీర్‌కి ఎందుకు శుభాకాంక్షలు చెప్పారంటే.. రణ్‌భీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీమ్‌కి ప్రభాస్ విషెస్ చెప్పారు. దీనికి రష్మిక కూడా థాంక్యూ ప్రభాస్ అంటూ రియాక్ట్ కూడా అయ్యింది. అంత పర్టికులర్‌గా యానిమల్ టీమ్‌కు ప్రభాస్ విషెస్ చెప్పటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి దర్శకుడు సందీప్ వంగాతో ప్రభాస్ తన 25వ సినిమా స్పిరిట్‌ను ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి భూషణ్ కుమార్ నిర్మాత. ఇదే నిర్మాత యానిమల్ సినిమాను నిర్మించటం కూడా రెండో కారణం.. ఏదేమైనా ప్రభాస్ మాత్రం రొటీన్‌కు భిన్నంగా తన పంథాను మార్చుకుని బాలీవుడ్ జనాలకు దగ్గరవుతున్నారని ఈ విషెస్ చూస్తుంటే తెలుస్తుంది.