English | Telugu
'ఐ' విక్రమ్ కు అసలు ఏమైంది?
Updated : Dec 19, 2014
కమల్ హాసన్ తరువాత సినిమాల కోసం మరీ ప్రయోగాలకు రెడీ అయిపోయే నటుడు విక్రమ్. తనదైన విలక్షణ నటనతో తమిళ, తెలుగులో ఏంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ తెరకెక్కించిన 'ఐ' మూవీలో నటించిన విక్రమ్, ఆ సినిమా కోసం బరువు తగ్గి బక్కపలుచబడిన ఫోటో ఒకటి సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ ఫోటో చూసిన కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నాడని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఈ వార్తలను విన్న ఆయన అభిమానులు వాటిని ఖండించారు. శంకర్ సూచన మేరకు ఆయన 'ఐ' సినిమాలో కురూపి గెటప్ కోసం విక్రమ్ బక్కచిక్కింది వాస్తవమే కానీ..ఆయన ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని స్పష్టం చేశారు. విక్రమ్ ప్రస్తుతం హ్యాపీగా వున్నారని, 'ఐ' రిలీజ్ కోసం వేచిచుస్తున్నారని చెబుతున్నారు. అలాగే విక్రమ్ వీక్ అయినట్లుగా కనిపిస్తున్న ఈ ఫోటో కూడా 'ఐ' సినిమా షూటింగ్ సమయంలోదని వారు క్లారిటీ ఇచ్చారు.