English | Telugu
సిసింద్రీ సినిమా.. టాప్ సీక్రెట్
Updated : Dec 19, 2014
సిసింద్రీ అఖిల్ సినిమాకి క్లాప్ కొట్టేశారు. ఈ సినిమాపై ఇటు అభిమానుల్లోనూ, అటు పరిశ్రమలోనూ ఎన్నో అంచనాలు. పైగా వినాయక్‌దర్శకత్వం వహిస్తున్న సినిమాకాబట్టి ఆలోమెటిగ్గా క్రేజ్‌మొదలైపోతుంది. అయితే ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్‌కి అప్పగించడం కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పరిశ్రమలోని బడా నిర్మాతలు అఖిల్ ఎంట్రీ సినిమా కోసం ముందుకొచ్చారు. చేతిలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఉంది. అయినా శ్రేష్ట్ మీడియావైపే మొగ్గు చూపాడు నాగ్. దానికి కారణం `మనం`సినిమానే. ఎందుకంటే మనం స్టోరీని సెట్ చేసి.. విక్రమ్ కె కుమార్‌ని నాగ్ కి పరిచయం చేసింది నిఖిల్ నాన్న... శ్రీనివాసరెడ్డి. అసలు మనం సినిమాని శ్రేష్ట్ మీడియా చేయాల్సింది. కానీ అరుదైన సినిమా కాబట్టి.. నాగ్ తన సొంత బ్యానర్‌లోనే తీశాడు. అప్పుడే శ్రీనివాసరెడ్డికి మాటిచ్చాడు నాగ్. ''మీ సంస్థలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తా'' అని. అలా.. సిసింద్రీకి వాళ్లకు కట్టబెట్టాడు. ఈ సినిమా శ్రేష్ట్ మూవీస్ చేతికి చిక్కడానికి అసలు కారణం ఇదీ..!