English | Telugu
ఎన్టీఆర్‌తో ఆటాడుకొంటున్న సుకుమార్
Updated : Dec 19, 2014
పాపం... అసలే బుడ్డోడు కష్టాల్లో ఉన్నాడు. యేళ్లుగా ఒక్క హిట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఫ్యాన్స్‌కూడా ఎన్టీఆర్ నిర్ణయాలపై అసంతృప్తితోనే ఉన్నారు. కొత్తవాళ్లకు, ఆల్రెడీ హిట్లు కొట్టినవాళ్లకూ అవకాశాలిచ్చి చేతులు కాల్చుకొన్నాడు ఎన్టీఆర్. అందుకే దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస.. ఇలా ఫ్లాప్ మీద ఫ్లాప్ తగులుతూనే ఉంది. అయితే ఈసారి సుకుమార్‌కి ఛాన్స్ ఇవ్వడం కూడా ఆసక్తిని రేకెత్తించింది. వన్ ఫ్లాప్ తో సుకుమార్ కూడా నిరాశలో కూరుకుపోయాడు. మరి వీరిద్దరి కలయిక ఎలా ఉండబోతోందో?? అన్న ఆసక్తి, అనుమానాలు రెండూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. దానికి తగ్గట్టు సుకుమార్ కూడా మరోసారి ప్రయోగాత్మక కథనే ఎంచుకొన్నాడట. మైండ్ గేమ్‌తో నడిచే ఈ కథ.. ఓ రివైంజ్ డ్రామా. ఇలాంటి కథలు తెలుగు చిత్రసీమకు కొత్త కాదు. సినిమా పుట్టినప్పటి నుంచీ వస్తూనే ఉన్నాయ్. కాకపోతే.. ఈసారి సుకుమార్ మాత్రం రివైంజ్ డ్రామాలోనే తన స్టైల్ మిక్స్ చేస్తున్నాడట. మైండ్ గేమ్, సైకాలజీ మిక్స్ చేసిన రివైంజ్ డ్రామా అని తెలిసింది. ఫక్తు కమర్షియల్ సినిమా తీసినా ఫర్లేదు గానీ, మాస్ హీరోని పట్టుకొని ప్రయోగాల బాట పడితే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో.. `1` సినిమా చూసినవాళ్లకు ఎవ్వరికైనా అర్థమవుతుంది. అలాంటి ప్రమాదం ఉన్నా.. ఎన్టీఆర్‌ని పట్టుకొని ప్రయోగాలు చేస్తున్నాడంటే సుకుమార్ గట్స్‌ని మెచ్చుకొని తీరాలి. అయితే... ఫలితం ఏమాత్రం తేడా వచ్చినా ఎన్టీఆర్ కెరీర్‌తో చెడుగుడు ఆడుకొన్నట్టే. బీకేర్ ఫుల్ సుక్కూ..