English | Telugu

నారా రోహిత్ ' సావిత్రి ' ఎలా ఉందో తెలుసా..? కంప్లీట్ రివ్యూ

స్టోరీ బేస్డ్ గా మూవీస్ ను ఎన్నుకుంటాడు అన్న పేరుంది నారారోహిత్ కు. ఈ మధ్యనే తుంటరి అంటూ పలకరించిన రోహిత్, ఈరోజు సావిత్రి అంటూ మళ్లీ ఆడియన్స్ ముందుకొచ్చాడు. సావిత్రి హిట్టుపైనే ప్రస్తుతం నారారోహిత్ చూపులున్నాయి. మరి ఈ సినిమా అతని ఆశల్ని నిలబెట్టిందా..? చూద్దాం రండి.

కథ
సావిత్రి (నందిత) కు జీవితంలో పెళ్లి ఒకటే ధ్యేయం. పెళ్లిచేసుకోవాలి అనేది ఆమె కల. పెళ్లంటే సావిత్రికి పిచ్చి. అలాంటి ఆమెకు పెళ్లి సెట్టవడంతో బామ్మ (రమాప్రభ) తో కలిసి షిర్డీకి రైల్లో బయలుదేరుతుంది. రైల్లో ఆమెకు రిషి (నారా రోహిత్) పరిచయమౌతాడు. అతన్ని చూసి సావిత్రి కూడా ప్రేమలో పడుతుంది. కానీ పెళ్లంటే తనకున్న పిచ్చి కారణంగా, పారిపోయి పెళ్లి చేసుకోవడం సావిత్రికి ఇష్టం ఉండదు. దాంతో రిషి ఆమె ఊరికొచ్చి తల్లిదండ్రులను ఒప్పించే పని పెట్టుకుంటాడు. మరి సావిత్రి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా..? రిషి వాళ్లనెలా ఒప్పిస్తాడు..? రిషి ఎదుర్కున్న ఒడిదుడుకులేంటి..? ఇది బ్యాలెన్స్ స్టోరీ..

పెర్ఫామెన్స్:
మాస్ క్యారెక్టర్ తో జనాన్ని మెప్పించడానికి చాలా ఎనర్జీ ఉండాలి. డైలాగ్ డెలివరీ పంచ్ ల్లా పేలాలి. కానీ నారారోహిత్ లో అదే మిస్సైనట్టు అనిపిస్తుంది. సీన్ ఎలాంటిదైనా, నుంచొని డైలాగులు చెబుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇక్కడే ప్రేక్షకులు సినిమానుంచి డిస్కనెక్ట్ అవుతారు. మరో వైపు సావిత్రి పాత్ర వేసిన నందిత మాత్రం మంచి పెర్ఫామన్స్ కనబర్చింది. ఈ రోల్ ఆమెకు టైలర్ మేడ్ గా సెట్ అయిపోయింది. రవిబాబు, మురళి శర్మ, అజయ్, జీవా లాంటి భారీ కాస్టింగ్ ఉన్నా, ఎవరి పాత్రకూ సరైన ఎండింగ్ ఉండదు. పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శీను నవ్విస్తారు. మధు, శ్రీముఖిల సీన్స్ బాగా పేలాయి. సత్యం రాజేష్, జబర్దస్త్ సత్య, ధన్య బాలకృష్ణన్ లు ట్రై చేసినా నవ్వించడంలో సక్సెస్ కాలేకపోయారు.

టెక్నికల్
డైరెక్టర్ పవన్ సాథినేని భారీ కాస్టింగ్ ను సినిమాలో పెట్టినా, వారి నుంచి పూర్తిస్థాయి నటనను రాబట్టలేకపోయాడు. సినిమాను ఇంట్రస్టింగ్ నడపడంలో స్క్రీన్ ప్లే సక్సెస్ కాలేకపోయింది. కృష్ణ చైతన్య డైలాగులు ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేదు. శ్రవణ్ ఇచ్చిన పాటల్లో సావిత్రి టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఫర్లేదనిపించాడు. వసంత్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ లు
ఫస్ట్ హాఫ్ ఫన్
కామెడీ సీన్స్

మైనస్ లు
రోహిత్ పెర్ఫామెన్స్
ముందే తెలిసిపోయే సెకండ్ హాఫ్

తెలుగు వన్ వ్యూ
సినిమాలో అన్ని రుచులు ఉన్నా, వాటిని సరైన ఆర్డర్లో వడ్డించడం మర్చిపోయాడు దర్శకుడు. ప్రస్తుతం వేరే పెద్ద సినిమాలు లేని నేపథ్యంలో కొన్నాళ్ల పాటు సావిత్రి నడుస్తుంది.

రేటింగ్ : 2/5

--- లోకేష్ బండి

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.