English | Telugu

మూవీ రివ్యూ : నన్ను వదిలి నీవు పోలేవులే

7/g బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికొక్కడు లాంటి సినిమాల ద్వారా మనకు సెల్వరాఘవన్ బాగానే పరిచయమున్నాడు. శ్రీరాఘవ కథతో అతని భార్య గీతాంజలి డైరెక్షన్లో వచ్చిన సినిమా నన్నువదిలి నీవు పోలేవులే. ఆఫ్ బీట్ సినిమాలు, డిఫరెంట్ జానర్ సినిమాలు తీస్తాడని శ్రీరాఘవకు పేరు. మరి అతని కథను ఆయన భార్య గీతాంజలి ఎలా తీశారు..? సినిమా ఎలా ఉందో హావ్ ఎ లుక్..

కథ :
మనోజ (వామికా గబ్బి) ధనవంతురాలైన అమ్మాయి. ప్రేమ పెళ్లి చేసుకుందామనుకున్న ఆమెకు, ఆ ప్రోసెస్ లో చేదు అనుభవాలు ఎదురవుతాయి. దాంతో, బలవంతంగా తన తల్లిదండ్రులు చూపించిన ప్రభు (కోలా బాలకృష్ణ) అనే అబ్బాయిని పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. పెళ్లైనా, ఇద్దరి మధ్యా ఎలాంటి అనుబంధం ఉండదు. తన గత అనుభవాల దృష్ట్యా, మనోజ భర్తకు దూరంగా మసులుకుంటుంది. దాంతో గత్యంతరం లేని ప్రభు చేయకూడని ఒక పని చేస్తాడు. ఆ పని ఇద్దరి మధ్యా విడాకులకు దారి తీస్తుంది. మరి ఆ వివాదాల్ని పరిష్కరించుకుంటారా..? తిరిగి మళ్లీ కలుస్తారా..? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫామెన్స్ :
అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది వామికా గబ్బి నటన. అందంతో పాటు నటన కూడా ఆమెలో పుష్కలంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన పాత్రకు ఉండే బాధను పెర్ఫెక్ట్ గా అభినయించగలిగింది. హీరోగా బాలకృష్ణ కోలా ఫర్వాలేదనిపించాడు. అతని గెటప్ రియల్ లైఫ్ శ్రీరాఘవకు దగ్గరగా అనిపించింది.

ప్లస్ లు :
హీరో హీరోయిన్ల నటన
ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ లు :
స్లో నెరేషన్
బృందావన కాలనీని గుర్తుచేసే సీన్స్
క్లైమాక్స్

టెక్నికల్ :
సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కినా, ఆన్ స్క్రీన్ క్వాలిటీగా కనపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా అంతా ఒక డల్ మూడ్ క్యారీ అవుతుంటుంది. సినిమాటోగ్రఫర్ శ్రీధర్, ఆ మూడ్ ను స్క్రీన్ మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. అమృత్ ఇచ్చిన పాటలు ఆకట్టుకోకపోయినా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేస్తుంది. శ్రీ రాఘవ భార్య గీతాంజలి, తన భర్త తీసే సినిమాల తరహా మూవీనే తీసింది. కానీ పాత సినిమాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. సన్నివేశాల్ని బాగానే తెరకెక్కించినా, ప్రీ క్లైమాక్స్ ఒక్కసారిగా స్పీడ్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. తమిళ డబ్బింగ్ సినిమా అన్న విషయం, ప్రేక్షకుడికి అడుగడుగునా గుర్తొస్తుంటుంది.

తెలుగువన్ వ్యూ :

7/g బృందావన కాలనీ ప్రేమికుల మధ్య జరిగితే, నన్ను వదిలి నీవు పోలేవులే భార్యాభర్తల మధ్య జరుగుతుంటుంది. పూర్తి ఆఫ్ బీట్ స్టోరీ. డార్క్ రొమాన్స్ జానర్లో వచ్చిన ఈ సినిమా కనెక్ట్ అయిన కొద్దిమందికీ బాగా నచ్చుతుంది. రెగులర్ ఆడియన్స్ కు పెద్దగా ఎక్కే అవకాశం లేదు.

రేటింగ్ : 2.25/5

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.