English | Telugu

మెగాస్టార్ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది..!

మెగాస్టార్ 150 వ సినిమా ఈజీగా 150 కోట్లు కలెక్ట్ చేసేస్తుందని అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రేస్టేజియస్ గా తెరకెక్కుతున్న చిరు 150 కు ఆ స్టామినా ఉందని తాను నమ్ముతున్నానన్నాడు బన్నీ. నిన్న రాత్రి విజయవాడలో జరిగిన సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తన ఒపీనియన్ చెప్పాడు. సినిమా నిర్మాత అల్లు అరవింద్ అయితే సరైనోడు చిరు 150కు ముందు గిఫ్ట్ లాంటిదని చెప్పడం విశేషం. కాగా, విజయవాడలో సరైనోడు టీం నిర్వహించిన విజయోత్సవ సభ సూపర్ హిట్టయ్యింది. సినిమా టీం అంతా ఈ విజయోత్సవంలో పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పాట పాడితే, అల్లు అర్జున్, క్యాథరిన్ ట్రెసాలు డైలాగ్స్ తో ఆడియన్స్ ను అలరించారు. డివైడ్ టాక్ తో మొదలైన సరైనోడు సినిమా, 50 కోట్లు దాసేసి 60 కోట్ల వైపు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు రిలీజవుతున్న సుప్రీం, సూర్య 24 సినిమాల ఫలితం బట్టి సరైనోడు 60 కోట్లకు చేరుకుంటాడా లేదా అన్నది ఆధారపడి ఉంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.