English | Telugu

పంచె తీసి..కోటేసిన మేస్ట్రో ఇళయరాజా..!

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా... సుమారు నాలుగు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు ఇళయరాజా. ఆయన సంగీతానికి పరవశించని వారు లేరు. 72 ఏళ్ల వయసులోనూ యువ సంగీత దర్శకులతో పోటీ పడుతూ అలుపెరగని బాటసారిలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆయన ఇప్పటికి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇంట్లోనూ..వేదికలపైనా ఎప్పుడూ తెల్ల పంచెతో పైన జుబ్బాతో మాత్రమే కనిపించేవారు. కానీ ఆయన తన గెటప్‌ మార్చేశారు. ఓ మ్యూజికల్ కన్సర్ట్ కోసం ఈయన తెల్ల సూట్ వేశారు. ఈ లుక్‌లో ఇళయరాజాని చూసిన వారందరు స్టన్నవుతున్నారు. స్టైల్‌గా గిటార్ పట్టుకుని నిల్చుని స్పైల్ ఇస్తున్న ఆయన ఈ గెటప్‌లో అదిరిపోయారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.