English | Telugu

సాయి ధరమ్ సుప్రీం ప్రీరిలీజ్ టాక్..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా సుప్రీం. కొంత కాలంగా డల్ ప్యాచ్ లో ఉన్న దిల్ రాజు సుప్రీం తనను మళ్లీ హిట్టు మెట్టెక్కిస్తుందని ఆశిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే రిలీజవుతోంది. సినిమాకు రీలీజ్ ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉండటం, సరైన టైంలో ప్రమోషన్లు స్టార్ట్ చేయడం సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే సినిమా కంటెంట్ ఎలా ఉందన్న దాని మీదే, లాంగ్ రన్ డిసైడ్ అవుతుంది. సాయి ట్యాక్సీ డ్రైవర్ గా కనిపిస్తాడని సినిమాలో అతని పాత్ర చాలా ఎనర్జిటిక్ ఉంటుందని మూవీ టీం చెబుతున్నారు. మరో వైపు హీరోయిన్ రాశి ఖన్నా బెల్లం శ్రీదేవి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవ్వులు పూయిస్తుందట. పటాస్ లో తన హ్యూమర్ టచ్ ను చూపించిన అనిల్ రావిపూడి, సుప్రీంలో కామెడీ మరో మెట్టు ఎక్కువే ఉంటుందని చెబుతున్నాడు. సినిమా మ్యూజిక్ విషయానికొస్తే, ఇప్పటికే అందం హిందోళం సాంగ్, సూపర్ హిట్ అయింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కూడా రీమిక్స్ సాంగ్ సూపర్ హిట్ అవడం విశేషం. సాయి కార్తీక్ అందించిన స్వరాలు ఆకట్టుకుంటున్నాయి. సాయి ధరమ్ కెరీర్లోనే అత్యంత భారీగా రిలీజ్ అవుతోంది సుప్రీం. ఈ సినిమాతో స్టార్ స్టేటస్ కొట్టేయాలనేది సాయి ఆలోచన. మరి సుప్రీం ఎలా ఉండబోతుందో చూడాలి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.