English | Telugu

సరైనోడు ఫస్ట్ డే ఓవర్సీస్ కలెక్షన్ రిపోర్ట్..!

కొన్నేళ్లుగా ఓవ‌ర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకి వ‌రంగా మారుతూ వ‌స్తోంది. నైజాం ఏరియాని బీట్ చేసే వ‌సూళ్లు అక్క‌డ తెచ్చుకోగ‌లుగుతున్నారు. చిన్న సినిమా అయినా స‌రే, బాగుంటే చాలు.. ఓవ‌ర్సీస్ వాసులు డాల‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లాంటి చిన్న సినిమా సైతం అక్క‌డ రూ.8 కోట్లకుపైగానే వసూలు చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పెద్ద హీరోల‌కు ఓవ‌ర్సీస్ వ‌సూళ్లు ఇప్పుడు కీల‌కంగా మారుతున్నాయి. అయితే.. మొన్న స‌ర్దార్ -గ‌బ్బ‌ర్‌సింగ్ ఓవ‌ర్సీస్ లో దారుణంగా నిరాశ ప‌రిచింది. ఇప్పుడు స‌రైనోడు స‌రిస్థితీ అంతేన‌ని ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాని ఓవ‌ర్సీస్‌లో రూ.7.5 కోట్లకు అమ్మారు. తొలిరోజే స‌రైనోడుకి డివైడ్ టాక్ వ‌చ్చిందిక్క‌డ‌. దానికి తోడు హింస‌, యాక్ష‌న్ మితిమీరి క‌నిపించాయి. ఇలాంటి సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో ఆద‌ర‌ణ ల‌భించ‌డం క‌ష్టం. తొలిరోజు ప్రీమియ‌ర్ షోల‌తో క‌ల‌సి రూ.1.5 కోట్లు మాత్ర‌మే వ‌సూలైంది. రెండోరోజు వ‌సూళ్లు సగానికి స‌గం ప‌డిపోయే ఛాన్సుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో రూ.5 కోట్లు తెచ్చుకోవడం గ‌గ‌నం అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. సో.. ఓవ‌ర్సీస్‌లో స‌రైనోడు ఫ్లాప్ అయిన‌ట్టే! ఆంధ్రా, తెలంగాణ‌ల్లో కూడా స‌రైనోడుపై బీసీ సినిమా అనే ముద్ర ప‌డిపోయింది. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఈ సినిమాకి ఆద‌ర‌ణ ల‌భించ‌డం చాలా చాలా క‌ష్ట‌మ‌ని సినీ పండితుల అభిప్రాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.