English | Telugu

అందరి చూపూ బ్రహ్మోత్సవం పైనే..!

సమ్మర్ అంటేనే సినిమాలకు ఎక్సలెంట్ మార్కెట్ ఉండే సీజన్. ఓ మాదిరి సినిమా రిలీజ్ చేసినా, సమ్మర్ ఎఫెక్ట్ తో సూపర్ హిట్ కొట్టేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అందుకే సినీజనాలందరి చూపూ సమ్మర్ పైనే ఉంటుంది. ఈ సెలవుల సీజన్ ను క్యాష్ చేసుకోవాలని పెద్ద హీరోలందరూ అనుకున్నారు. కానీ ఇది ఫ్యామిలీలు ఎక్కువగా వచ్చే సీజన్ అని మర్చిపోయారు. సర్దార్, సరైనోడు రెండూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను విస్మరించి కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వచ్చాయి. సర్దార్ రిజల్ట్ క్లియర్ గా తెలిసిపోయింది. సరైనోడు ఫస్ట్ డే టాక్ మరీ మాస్ అని వచ్చినా, దగ్గర్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి, మెల్లగా పికప్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపులు మహేష్ బ్రహ్మోత్సవం మీదే ఉన్నాయి. ఈ సమ్మర్ అంతా మాస్ సినిమాలే వచ్చాయి కాబట్టి తమది ఫ్యామిలీ సినిమా అనే ట్యాగ్ తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మహేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చిన నేపథ్యంలో, అదే నమ్మకాన్ని ఆడియన్స్ ను కలిగించానుకుంటున్నారు మహేష్ అండ్ కో. ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలు దెబ్బైపోవడంతో, తమ హీరో అయినా హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకుంటాడని కొండంత ఆశతో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్. ఇండస్ట్రీకి కూడా ఇప్పుడు పెద్ద హిట్ చాలా అవసరం. మరి మహేష్ ఏం చేస్తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.