English | Telugu

నిరాడంబరంగా షకలక శంకర్ పెళ్లి..పెళ్లి ఖర్చు అనాథలకు..!

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన షకలక శంకర్ ఓ ఇంటి వాడయ్యాడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని ఒక ప్రైవేట్ కళ్యాణమండపంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఆయన పెళ్లి జరిగింది. వరుసకు మేనమామ కూతురు అయిన పార్వతిని శంకర్ వివాహమాడారు. తన తండ్రి మొక్కు కారణంగా అరసవిల్లిలో పెళ్లి చేసుకున్నానని. అందుకే జబర్దస్త్ యాక్టర్స్ ఎవ్వరిని పిలవలేదన్నారు. కోట్లాది మంది మొక్కే ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను హాస్టల్‌లో ఉండి 10వ తరగతి వరకు చదవుకున్నానని, అక్కడి పిల్లల బాధలు తెలుసునని పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం కంటే ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆ డబ్బు ఇవ్వాలనుకుంటున్నాని శంకర్ తన మనసులో మాట బయట పెట్టారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.