English | Telugu
పవన్ పై మరో నమ్మలేని గాసిప్
Updated : Mar 14, 2016
వివాదాలకూ, విమర్శలకూ పవన్ కల్యాణ్ ఎంత దూరంగా ఉండాలనుకొంటాడో... అవి అంత దగ్గరవుతుంటాయి. పవన్‌పై వచ్చే గాసిప్పులకూ అంతూ పొంతూ ఉండదు.రోజుకొకటైనా పుడుతూనే ఉంటుంది. అయితే వాటిపై ఏనాడూ పవన్ స్పందించడు. తాజాగా పవన్ పై మరో గాసిప్ హల్ చల్ చేస్తోంది. సర్దార్ సెట్లో పవన్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌పై చేయిచేసుకొన్నాడన్నది ఆ రూమర్ల సారాంశం. ఇటీవల సర్దార్ సెట్ కి స్నేహపూర్వకంగా వచ్చాడు త్రివిక్రమ్. ఆ సమయంలో పవన్ సెట్లో లేడట. పవన్ వచ్చే వరకూ త్రివిక్రమ్‌ని ఖాళీగా ఉంచడం ఎందుకూ...?? అనుకొన్నాడేమో, ఓ అసిస్టెంట్ డైరెక్టర్... సర్దార్ ఫుటేజీలో కొంత భాగాన్ని త్రివిక్రమ్‌కి చూపించాడట.
ఈ విషయం తెలుసుకొన్న పవన్.. ఆ సహాయ దర్శకుడిపై చేయి చేసుకొన్నాడట. ఫుటేజ్‌ని ఎవరు చూపించమన్నారు? అంటూ ఫైర్ అయ్యాడట. వెంటనే ఆ సహాయ దర్శకుడ్ని టీమ్ లోంచి తొలగించారని సమాచారం. అయితే ఈ విషయంపై ఆరా తీస్తే.. చిత్రబృందం స్పందించడం లేదు. `మైకు పట్టుకొంటే నీతులు మాట్లాడే పవన్.. బయట ఇలా ఉంటాడా?` అంటూ పవన్ ఫ్యాన్స్ సైతం విస్తుపోతున్నారు. ఎదుటి వాళ్లకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి... అనే మాట నిజమే మరి.