English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త టీజర్ రిలీజయ్యింది
Updated : Mar 17, 2016
ఈరోజు టీజర్ అని తెలియగానే పవన్ ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. నిన్నటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆరాటానికి తెరపడింది. తెరచిరిగిపోయే టీజర్ ను రిలీజ్ చేసింది సర్దార్ మూవీ టీం. ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ అయిన టీజర్, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. గబ్బర్ సింగ్ మొదటి సినిమాలో సర్దార్ అన్న పదం లేదు. ఇక్కడ మాత్రం యాడ్ అయింది అంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఎనర్జీ.
గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్ యాజ్ సర్దార్.సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్ అంటూ దేవీ వాయిస్ లో మ్యూజిక్ వినిపిస్తుంటే, పవన్ వెనకాల జబర్దస్త్ టీం హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. పిల్ల గబ్బర్ సింగ్ లతో పవన్ పరిగెడుతున్న షాట్ తో టీజర్ ను ఎండ్ చేశారు. టీజర్ కు అదే హైలెట్ అని చెప్పుకోవాలి. టీజర్ వచ్చేసింది కాబట్టి, పవనిస్టుల చూపులు 20వ తారీఖున జరగబోయే ఆడియో ఫంక్షన్ కు, అప్పుడు రిలీజవ్వబోయే ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఏప్రిల్ 8 న సర్దార్ గ్రాండ్ గా ఇండియా వైడ్ రిలీజ్ అవనున్న సంగతి తెలిసిందే.