English | Telugu
ఏప్రిల్ ఒకటికి మారిన సావిత్రి రిలీజ్ డేట్
Updated : Mar 16, 2016
వైవిధ్యమైన కథలు చేస్తూ, ఇప్పుడున్న హీరోలకు భిన్నమైన దారిలో వెళ్తున్నాడు నారా రోహిత్. వీలైనంత వరకూ కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు ప్రిఫర్ చేస్తున్నాడు రోహిత్. తాజాగా, ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం పవన్ సాధినేనికి తన సావిత్రి సినిమాను తీసే ఛాన్స్ ఇచ్చాడు. నారా రోహిత్, నందిత జంటగా నటించిన సావిత్రి ఈ నెల 25న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు డేట్ మారింది. ఏప్రిల్ 1 కి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నామని తన ఫేస్ బుక్ లో మూవీ అప్ డేట్ ఇచ్చాడు రోహిత్.
ఏప్రిల్ ఒకటిన గ్రాండ్ రిలీజ్ అంటూ, కొన్ని పోస్టర్లు కూడా పోస్ట్ చేశాడు. పోటీ సినిమాలేవీ లేకపోవడంతో ఇప్పటికే తుంటరి ప్రాఫిట్స్ లోకి చేరుకుంది. దీంతో ఇప్పుడు సావిత్రి మీద కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు నారావారబ్బాయి. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను నారా రోహిత్ పాడటం విశేషం.