English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ డేట్ మారలేదు
Updated : Mar 10, 2016
గత కొన్ని రోజులుగా, సర్దార్ సినిమా షూటింగ్ లేట్ అవుతోందని, టైం కి రీలీజవ్వదని వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాత శరత్ మరార్, ట్విట్టర్లో కంప్లీట్ క్లారిఫికేషన్ ఇచ్చారు. సర్దార్ డేట్ మారలేదని, సేమ్ డేట్ కు వస్తున్నాడంటూ ఆయన కన్ఫామ్ చేశారు. ఇప్పటికే చిన్న చిన్న టీజర్లతోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న పవన్ సర్దార్ ఏప్రిల్ 8 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందుకే డేట్ దగ్గర పడే కొద్దీ, అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. సినిమా రిలీజ్ డేట్ తో పాటు, ఆడియో రిలీజ్ కూడా వచ్చేవారాంతంలో ఉండబోతోందని క్లారిఫై చేశారు శరత్. సర్దార్ తో పాటు కానిస్టేబుల్స్, గూండాలు, గ్యాంగులు అందరూ సర్దార్ రిలీజ్ కోసమే కష్టపడతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. దాంతో పాటు సెట్లోని ఒక ఫోటోను కూడా ఆయన ట్వీట్ చేయడం విశేషం