English | Telugu
స్వచ్ఛభారత్ యాడ్ నా సినిమా కంటే వరస్ట్ గా ఉంది
Updated : Mar 10, 2016
వర్మకు స్వచ్ఛభారత్ కోసం వస్తున్న యాడ్స్ నచ్చలేదట. ఆయన డైరెక్షన్లో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన ఆగ్ సినిమాను బాలీవుడ్ లో అత్యంత చెత్త సినిమా అంటుంటారు విమర్శకులు. క్లాసిక్ సినిమా షోలేను ఆగ్ పేరుతో రీమేక్ చేశారు వర్మ. ఆ సినిమాకు ఆల్ మోస్ట్ ఆయన కెరీర్ బలైపోయినంత పనైంది. ఆ సినిమాతో పోలుస్తూ తన మీద తనే సెటైర్ వేసుకుంటూనే, ఆగ్ కంటే స్వచ్ఛభారత్ యాడ్స్ చెత్తగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రభుత్వం తీస్తున్న స్వచ్ఛభారత్ యాడ్ ఆగ్ సినిమా కంటే వరస్ట్ గా ఉంది. ఇలాంటి సినిమాలు ఇండియాను మరింత మురికిగా చూపిస్తాయనే విషయాన్ని ఎవరైనా మోడీకి చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఏదో విధంగా న్యూస్ లో ఉండటం అలవాటైపోయిన వర్మ, ఇప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రినే టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. స్వచ్ఛభారత్ అభియాన్ ప్రోగ్రామ్ నరేంద్రమోడీ మానస పుత్రిక అన్న సంగతి తెలిసిందే.