Read more!

English | Telugu

పాత్ర కోసం నెలరోజుల్లో 18 కేజీలు

పాత్ర కోసం తమను తామే మార్చేసుకోవటాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. అంటే దాదాపు పరకాయ ప్రవేశంలా అన్నమాట. ఈ తరహా యాక్టింగ్ ను ఎక్కువగా హాలీవుడ్ లోనే చూస్తుంటాం. మన దగ్గర సూర్య, విక్రమ్ లు కూడా ఇలాంటివి ట్రై చేస్తుంటారు. లేటెస్ట్ గా బాలీవుడ్ యాక్టర్ రణ్ దీప్ హుడా, సరబ్ జిత్ సినిమాలో తన పాత్ర కోసం సాహసం చేశాడు. కేవలం నెలరోజుల్లోనే ఏకంగా 18 కేజీల బరువు తగ్గిపోయాడు.
 

23 ఏళ్ల పాటు పాకిస్థాన్ జైల్లో మగ్గిన భారతీయుడి కథే సరబ్ జిత్. లాహోర్ లోనే మరణించిన సరబ్ జిత్ ను పాకిస్థాన్ లో కేవలం నాలుగడుగుల గదిలోనే ఉంచేవారు. ఒళ్లంతా ఎలుకల గాట్లతో, పూర్తిగా చిక్కి శల్యమైపోయిన సరబ్ జిత్ పాత్రను పోషించాలంటే, అలాగే తయారవ్వాలని భావించాడు రణ్ దీప్. నెలరోజులుగా, డాక్టర్ పర్యవేక్షణలో కేవలం నీరు కాఫీ తాగుతూ, పూర్తిగా మారిపోయాడు. షూటింగ్ మొదలైన మొదటి రోజు డైరెక్టర్ ఒమంగ్ కుమార్ కూడా రణ్ దీప్ ను గుర్తు పట్టలేకపోయాడట. సిక్స్ ప్యాక్ టోన్డ్ బాడీతో ఉండే రణ్ దీప్, కేవలం సినిమాలో పాత్ర కోసం ఇలా మారడం నిజంగా సాహసమే..