English | Telugu
ఐశ్వర్యారాయ్ షాకింగ్ ఫస్ట్ లుక్
Updated : Mar 1, 2016
ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ పెళ్లైన తర్వాత, గ్లామరస్ రోల్స్ మానేసి, ఫెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలే ఎంచుకుంటోంది. లాంగ్ గ్యాప్ తర్వాత యాక్ట్ చేసిన జజ్బా బకెట్ తన్నినా, ఐశ్వర్యలోని కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. సరబ్ జిత్ సినిమాలో మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాకిస్థాన్ జైల్లోమగ్గిపోయిన భారతీయుడు సరబ్ జిత్ కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో, రణ్ దీప్ హుడా టైటిల్ రోల్ చేస్తున్నాడు. సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్ గా ఐశ్వర్య నటిస్తోంది.
ఇప్పటికే సరబ్ జిత్ పాత్ర కోసం, రణ్ దీప్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా ఐశ్వర్య కూడా, సినిమా లుక్స్ లో భాగంగా, వయసు మళ్లిన మహిళలా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ లో ఐశ్వర్యను చూసిన వారు ఐశ్వర్యేనా అని అనాల్సిందే. తన సోదరుడి స్వేచ్ఛకోసం తపించే సోదరిగా, ఐశ్వర్య కంటతడి పెట్టించబోతోంది. ఈ సినిమా తర్వాత, ఐష్ కు మరింత ప్రయోగాత్మక పాత్రలు వస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ లో బయోపిక్ లు సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో, మేరీకోమ్ ఫేమ్ ఓమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సరబ్ జిత్ పై కూడా భారీగా అంచనాలున్నాయి.