English | Telugu
అందమైన దెయ్యాలు
Updated : Mar 1, 2016
హార్రర్ మూవీస్ ఇప్పుడు ట్రెండ్. హర్రర్ బేస్ తో వచ్చిన ప్రతీ మూవీ, మినిమం లాభాలు తెచ్చేసుకుంటోంది. అందుకే మన వయ్యారి భామలు కూడా తమను తాము అందాలు దెయ్యాల్లా చూపించి ప్రేక్షకుల మతులు పోగొడుతున్నారు. చంద్రముఖిలో జ్యోతిక నుంచి, నిన్న మొన్న వచ్చిన కళావతి వరకూ, మన అందమైన దెయ్యాల్ని ఓసారి చూసి అందంగా భయపడండి మరి..
అప్పటి వరకూ జ్యోతిక అందం గురించే అభిమానులకు తెలుసు. కానీ చంద్రముఖిగా జ్యోతికను చూసిన వారికి, రాత్రుళ్లు కలలోకి కూడా వచ్చేలా నటించింది జ్యోతిక.
హీరోయిన్ గా పెద్దగా ఫ్యామస్ అవ్వకపోయినా, దెయ్యంగా చంద్రికలో అదరగొట్టేసింది కామ్నా జెఠ్మలానీ.
పాల బుగ్గలతో సిమ్లా యాపిల్ లా ఉండే హన్సిక కూడా, చంద్రకళలో దెయ్యంగా వచ్చి తుక్కు రేగ్గొట్టింది.
ప్రేమకథాచిత్రమ్ లో కామెడీ దెయ్యంగా యాక్ట్ చేసి, కుర్రాళ్లకు కితకితలు పెట్టింది నందిత.
కలర్స్ తో చిలిపిగా కవ్వించిన స్వాతి కూడా, తనలో దెయ్యముందని ప్రూవ్ చేసుకుంది త్రిపుర సినిమాతో.
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటేసినా, త్రిషకు ఆ ఒక్కకోరిక మాత్రం ఉండిపోయింది. దాన్ని కళావతిలో తీర్చేసుకుంది. దెయ్యంగా త్రిష చేసిన యాక్టింగ్ కు జనాలు ఇష్టపడుతూనే భయపడ్డారు.