English | Telugu
రాక రాక వచ్చిన ఆస్కార్ ను బార్ లో వదిలేశాడు..!!
Updated : Mar 1, 2016
దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘమైన వెయిటింగ్ తర్వాత ఆస్కార్ ను సొంతం చేసుకున్న లియోనార్డ్ డీ కాప్రియో ఆ తర్వాత పార్టీ చేసుకున్నాడు. ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. కానీ తాను ఏ అవార్డ్ వచ్చినందుకు పార్టీ చేసుకుంటున్నాడో, ఆ ఆస్కార్ ప్రతిమను క్లబ్ లోనే మర్చిపోయాడు. ఈ-సిగార్ తో పొగ త్రాగి, స్నేహితులతో కబుర్లు చెప్పి, కాక్ టెయిల్ తాగిన లియో, ఆ బంగారు బొమ్మను మాత్రం క్లబ్ లోనే మర్చిపోయాడు.
బయటికి వచ్చి కార్ ఎక్కేసిన తర్వాత, ఎవరో వచ్చి అతని డ్రైవర్ కు ఆ ఆస్కార్ ను ఇచ్చాడు. దీంతో, లియోకు కళ్లు నెత్తికెక్కాశాయంటూ, నెటిజన్లు ఇప్పుడు లియోపై సెటైర్లు వేస్తున్నారు.