English | Telugu

మెగాభిమానులు ఓన్ చేసుకోవట్లేదా..

చిరంజీవి వారసుల్లో ఆయన పోలికలతో ఎవరూ లేరేంటా అంటూ నిరాశలో ఉన్న మెగాభిమానులకు మినీ మెగాస్టార్ లా దొరికాడు సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా రేయ్ తో తను ఇబ్బంది పడి, ఇబ్బంది పెట్టినా, రెండో సినిమా నుంచి మాత్రం తేజులో తేడా కొట్టొచ్చినట్టు కనబడింది. సినిమా సినిమాకూ తనను తాను డెవలప్ చేసుకుంటూ, మెగాస్టార్ పోలికలకు దగ్గరగా వెళ్లడానికి ట్రై చేస్తున్నాడు. పనిలో పనిగా, చిరు పాటల్ని రీమేక్ చేయడమే కాక, ఆయన కెరీర్ మొదట్లో ఉన్న సుప్రీం ట్యాగ్ ను కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడిది మెగాభిమానులకు పెద్దగా రుచించడం లేదని తెలుస్తోంది.

చిరు పాటలతో పాటు, సినిమా టైటిల్స్ ని కూడా వాడుకోవడం వారికి నచ్చట్లేదట. చిరు వారసుడిగా, చరణ్ నే తప్ప ఇంకెవరినీ ఒప్పుకోమని మెగాభిమానులు చెప్పడం తేజుకు నిరాశ కలిగించేదే. లేటెస్ట్ గా గోపిచంద్ మలినేనితో అనుకున్న గ్యాంగ్ లీడర్ టైటిల్ క్యాన్సిల్ కావడమే దీనికి రుజువంటున్నాయి సినీవర్గాలు. చిరు మేనల్లుడే కాక, ఆయన పోలికలు కూడా ఉన్న సాయి ధరమ్ తేజను మెగా ఫ్యాన్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారన్నది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. దీని వెనుక రాజకీయాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఇది నిజమైతే మాత్రం, తేజు కూడా పవన్ కళ్యాణ్, బన్నీల్లా సొంతంగానే తన ఫ్యాన్స్ ను తయారుచేసుకోవాల్సి వస్తుందనడంలో డౌట్ లేదు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.