English | Telugu
చిరు ఇంటికెళ్లిన పవన్
Updated : Mar 18, 2016
పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా, అది ట్రెండింగ్ టాపిక్స్ లో టాప్ లో కూర్చుంటోంది. పవన్ స్టామినా రోజురోజుకూ పెరిగిపోతోందంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఒకప్పుడు మెగాస్టార్ కు ఇదే రేంజ్ స్టార్ డం ఉండేది. ఆయన కోసం జనం పిచ్చెక్కిపోయేవారు. దాదాపు అన్ని హీరోల ఫ్యాన్స్, చిరంజీవిని కూడా అభిమానించేవారు. ప్రస్తుతం మెగా స్థానంలోకి పవర్ స్టార్ రీచ్ అయ్యారని చెప్పచ్చు. ఇలాంటి ఇద్దరు స్టార్స్ కలిసి ఉంటే, ఇండస్ట్రీకి కూడా మంచిదే. ఈ ఒపీనియన్ తోనే ఇద్దరికీ మధ్య మనస్పర్ధలేవీ లేవని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారీ అన్నదమ్ములు.
బ్రూస్ లీ కోసం పవన్ చిరును కలిశారు. సర్దార్ సెట్స్ లో పనిగట్టుకుని వచ్చి చిరు సందడి చేశారు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ మళ్లీ చిరును కలిశారని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. సర్దార్ ఆడియోకు ముఖ్యఅతిథిగా రావాలని పవన్ చిరును ఆహ్వానించారనే టాక్ నడుస్తోంది. దీంతో చిరు ఆడియోకు రావడం కన్ఫామ్ లాగే కనిపిస్తోంది. చివరిగా మెగాబ్రదర్స్ కలిసి కనబడిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ ను దుమ్ము దులిపేసింది. మరి సర్దార్ కు కూడా అన్నయ్య వచ్చాడంటే, మళ్లీ తమ్ముడి సినిమా ఊపు ఊపబోతుందా..? ఒకవేళ సెంటిమెంట్ వర్కవట్ అయితే బాక్సాఫీస్ కు పూనకం రావాలి మరి..చూద్దాం