English | Telugu
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కు వచ్చేశాడు
Updated : Mar 5, 2016
స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో యంగ్ టైగర్ చేస్తున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా కాంబినేషన్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో, సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలెట్టిన జనతా గ్యారేజ్ టీం, మోహన్ లాల్ పార్ట్ ను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈరోజు నుంచి ముంబైలో మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు ఉండబోతోందని సమాచారం. సినిమాకు కీలకమైన సీన్స్ అన్నీ, మెయిన్ స్టార్ క్యాస్ట్ తో ముంబైలో తెరకెక్కించనున్నారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న జనతాగ్యారేజ్ ను శ్రీమంతుడు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు.