English | Telugu

ఏప్రెల్ నుండి సంపత్ నంది, రామ్ చరణ్ "రచ్చ"

ఏప్రెల్ నుండి సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే చిత్రం "రచ్చ" ప్రారంభం కానుంది. విషయానికొస్తే వరుణ్ సందేశ్ హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా, నిర్మించిన "ఏమైంది ఈ వేళ" చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ "రచ్చ" చిత్రానికి అంటే రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ "రచ్చ" చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తారు.

ఈ చిత్రం ఏప్రెల్ నెల నుండి సెట్స్ మీదకు రానుంది. ఈ "రచ్చ" చిత్రంలో హీరో రామ్ చరణ్ సరసన "ప్రేమ కావాలి" చిత్రం ఫేం ఇషా చావ్లా హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం కథ హీరో రామ్ చరణ్ కి చాలా బాగా నచ్చిందని సమాచారం. "రచ్చ" పేరుని సంపత్ నంది ఎప్పుడో రిజిస్టర్ చేశారు. ఈ "రచ్చ" పేరుని బోయపాటి, యన్ టి ఆర్ ల చిత్రానికి పెడుతున్నారని వినపడింది. ఈ "రచ్చ" పేరు రామ్ చరణ్ చిత్రానికి దక్కింది.