English | Telugu

చిన్నారిని నడిపించిన సమంత

సమంత...అందం, అభినయంతో పాటు కోట్లలో ఒకరికి మాత్రమే ఉండే మంచి మనసు ఆమె సొంతం. ఒకవైపు సినిమాలు చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మానవత్వాన్ని చాటుకుంటోంది. ఆర్థిక స్తోమత లేక వైద్యానికి దూరమవుతున్న పిల్లల కోసం కొన్నేళ్ల క్రితం ప్రత్యూష ఫౌండేషన్స్ స్థాపించిన సమంత ఇప్పటికే ఎంతోమంది పిల్లలకు వైద్య సాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా ప్రమాదంలో తన ఎడమ కాలు కోల్పోయిన భవాని అనే చిన్నారికి ఉచితంగా వైద్య సహాయం అందించి కృత్రిమ కాలును ఏర్పాటు చేయించింది. భవాని పరిస్థితి తెలుసుకుని స్వయంగా సమంత ఆసుపత్రికి వచ్చి సాయం అందించారని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. భవానిని మామూలు మనిషిని చేసిన సమంతకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.