English | Telugu

తోటి నటుడిని ఆదుకున్న విశాల్

ఆపదల సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుండే ప్రముఖ నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ తన పెద్ద మనసును నిరూపించుకున్నాడు. వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యాయత్నం చేసిన తమిళ నటుడు ఇళవరసన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న విశాల్ తన దేవీ సంక్షేమ సంఘం నుంచి కొంతమంది వ్యక్తుల్ని ఇళవరసన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పంపించాడు. వారు ఆసుపత్రి ఖర్చులకు రూ.10,000 అందించారట. దానితో పాటు అతని సమస్యలను కూడా త్వరలో తీరుస్తానన్నట్లు తన మనషులతో హామీ ఇప్పించాడట. చెన్నై వరదల సమయంలో స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్న విశాల్ ఇప్పుడు మరోసారి అభిమానుల మనసు దోచుకున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.