English | Telugu

స్వాతికి ఝ‌ల‌క్ ఇచ్చిన కొత్త‌మ్మాయి

రీతూ వ‌ర్మ‌.. ఈ పేరు ఈమ‌ధ్య తెగ వినిపిస్తోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని, షార్ట్ గ్యాప్ లో మెయిన్ స్ట్రీమ్ లోకి వ‌చ్చేసింది రీతూ. పెళ్లి చూపులు సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో రీతూకి అవ‌కాశాలు పెరుగుతున్నాయి. తాజాగా నిఖిల్ స‌ర‌స‌న న‌టించ‌డానికి సై అనేసింద‌ట‌. నిఖిల్ క‌థానాయ‌కుడిగా స్వామి రారా చిత్రం రూపుదిద్దుకొంది. నిఖిల్‌ని హీరోగా నిల‌బెట్టిన సినిమా అది. ఆ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. తొలి భాగంలో క‌థానాయిక‌గా న‌టించిన స్వాతి ప్లేసులో.. రీతూ వ‌చ్చింద‌న్న‌మాట‌. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. స్వామి రారా 2 అన‌గానే.. త‌న‌కు మ‌రో అవ‌కాశం ద‌క్కుతుంద‌ని స్వాతి అనుకొంది. పాపం.. ఆ ఛాన్సుని.. రీతూ ఎగ‌రేసుకుపోయింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.