Read more!

English | Telugu

సమంత ఆ సీన్స్ కు నో చెప్పిందా..?

తెలుగు తమిళ సినీ రంగాల్లో, టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసి టాప్ హీరోయిన్ అయింది సమంత. తాజాగా త్రివిక్రమ్ తో తన మూడో సినిమా ' అ..ఆ ( అనసూయ రామలింగ్ వర్సెస్ ఆనంద్ విహారి ) ' చేస్తోంది. అంతకు ముందు చేసిన అత్తారింటికి దారేదిలో, సమంతతో త్రివిక్రమ్ ఒక బాత్రూమ్ సీన్ చేయించాడు. అయితే సినిమా నిడివి ఎక్కువైందని, ఆ సీన్ సినిమా నుంచి కట్ తీసేశారు. ఆ తర్వాత యూట్యూబ్ లో పెట్టడంతో సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ రావడంతో, త్రివిక్రమ్ అలాంటి సీనే అ..ఆ లో ప్లాన్ చేశాడు. కాకపోతే, వాటిని తీసేప్పుడు మాత్రం త్రివిక్రమ్ కు పెద్ద చిక్కే వచ్చిందట.దీనికి సంబంధించి ఒక టాక్ ఫిల్మ్ నగర్ లో వినబడుతోంది.

మొదట ఈ సీన్ షూటింగ్ హోటల్లో ప్లాన్ చేశారట. కానీ ఏమైందో ఏమో హోటల్ లో ఆ సీన్స్ చేసేది లేదని సమంత ఖచ్చితంగా చెప్పేయడంతో, ఆ సీన్స్ కోసం మళ్లీ సెట్ వేయించాడట త్రివిక్రమ్. హాటల్ బాత్రూమ్ అంటే సమంత ఎందుకంత భయపడింది..అందులో ఏముందబ్బా..అంటూ చెవులు కొరుక్కుంటున్నారు సినిమా జనాలు. మరి అత్తారింటికి దారేది సీన్లలాగే , అ..ఆ లో సీన్లు కూడా ప్రేక్షకులను అలరిస్తాయో లేదో చూడాలి..