English | Telugu

పవన్ కళ్యాణే ఎందుకు టార్గెట్..?

దిల్ రాజు సూపర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నా, అతనికి ఒక లోటు ఉండిపోయింది. ఇప్పటికే చాలా సార్లు ఆ విషయాన్ని చెప్పాడు. డైరెక్ట్ గా పవన్ ముందే ఒక ఫంక్షన్లో అన్నాడు కూడా. కానీ ఇప్పటికీ పవన్ దిల్ రాజుకు ఆ అవకాశం ఇవ్వలేదు. తాజాగా కృష్ణాష్టమి ప్రెస్ మీట్ లో కూడా పవన్ గురించి మరోసారి ప్రస్తావించాడు దిల్ రాజు. తన జీవిత ధ్యేయం పవన్ తో సినిమా చేయడమేనంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఇంతకూ దిల్ రాజుకు ఎందుకు పవన్ తో సినిమా గురించి అంత ఆలోచన..? సినిమాను బిజినెస్ చేసుకోవడంలోనూ, అంచనా వేయడంలోనూ దిట్ట అని ఇండస్ట్రీలో దిల్ రాజుకు పేరు. పవన్ కున్న ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకోవాలని రాజు ఆత్రమా..? పవన్ తో సినిమా తీసి భారీ లాభం వెనకేసుకోవాలనుకుంటున్నాడా..? దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కు పవన్ ఎందుకు ఛాన్స్ ఇవ్వకుండా ఊరిస్తున్నాడు..? ఇవీ ఇప్పుడు సినీజనాల ముందున్న ప్రశ్నలు. దాదాపు తను వచ్చిన ప్రతీ ఫంక్షన్లోనూ పవన్ గురించి ఒక మాటైనా మాట్లాడుతున్నాడు దిల్ రాజు. పవన్ ఓకే అంటే, ఎంత బడ్జెట్ అయినా పర్లేదని కూడా క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇక సమాధానం మాత్రం పవన్ వైపునుంచే రావాలి. మరి పవన్ ఏం చేయబోతున్నాడో చూాడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.