English | Telugu

'మిర్జాపూర్ 1'కి 12 కోట్లు.. 'మిర్జాపూర్ 2'కి 60 కోట్లు!


ఇప్పుడు ఎవ‌రైనా ఈజీగా ఊహించేయ‌వ‌చ్చు.. 'మిర్జాపూర్' సిరీస్‌కు మూడో సీజ‌న్ కూడా వ‌స్తుంద‌ని. ఎందుకంటే 'మిర్జాపూర్' సిరీస్‌ ఇండియాలోని వెబ్ సిరీస్‌ల‌కు సంబంధించిన అన్ని రికార్డుల‌నూ బ్రేక్‌చేసి, ఇండియ‌న్ డిజిట‌ల్ సిరీస్‌ల‌లో అత్య‌ధికులు వీక్షించిన సిరీస్‌గా స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది!

ఒక రాజ‌కీయ హంత‌కుల కుంటుంబంలోని పెద్ద‌గా న‌టించిన పంక‌జ్ త్రిపాఠి ఇంత‌కు ముందెప్పుడూ త‌ను న‌టించిన సినిమాలు లేదా సీరియ‌ల్స్‌లో ఈ త‌ర‌హా క్రేజ్ చూడ‌లేద‌ని చెప్పారు. "మిర్జాపూర్ సీక్వెల్‌కు వ్య‌క్త‌మైన కుతూహ‌లం, ఉత్సాహం నేను ఇంత‌దాకా చూసిన దేనికైనా మించిపోయింది. నేనెక్క‌డికి వెళ్లినా 'మిర్జాపూర్ 2'లో నేను పోషించిన క‌లీన్ భ‌య్యా క్యారెక్ట‌ర్ గురించే అడుగుతున్నారు. నేనింత దాకా పోషించిన ఏ క్యారెక్ట‌ర్‌కూ ఇలాంటి స్పంద‌న‌ను చూడ‌లేదు" అని ఆయ‌న తెలిపారు.

'మిర్జాపూర్‌'లో ఇత‌ర క్యారెక్ట‌ర్ల‌కు వ‌చ్చిన క్రేజ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇంత‌దాకా మ‌నం చూసి ఉండ‌లేద‌నేది నిజం. ఫ‌స్ట్ సీజ‌న్‌తో పోలిస్తే 'మిర్జాపూర్ 2' బ‌డ్జెట్ ఐదు రెట్లు ఎక్కువ అని అమెజాన్ ప్రైమ్‌కు చెందిన వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

"ఫ‌స్ట్ సీజ‌న్‌కు చెల్లించిన దానికంటే రెట్టింపు పారితోషికాన్ని ప్ర‌తి ప్ర‌ధాన యాక్ట‌ర్‌కూ చెల్లించారు. క‌లీన్ భ‌య్యా (పంక‌జ్ త్రిపాఠి), గుడ్డు (అలీ ఫ‌జ‌ల్‌), మున్నా (దివ్యేందు త్రిపాఠి) క్యారెక్ట‌ర్లు భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ సినిమాల్లో న‌టించే వెండితెర హీరోల‌కు మించి పాపులారిటీ తెచ్చుకున్నాయి" అని ఆ వ‌ర్గాలు చెప్పాయి.

'మిర్జాపూర్' ఫ‌స్ట్ సీజ‌న్‌కు కేవ‌లం రూ. 12 కోట్లు ఖ‌ర్చ‌వ‌గా, 'మిర్జాపూర్ 2'ను దాదాపు రూ. 60 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఇక సీజ‌న్ బ‌డ్జెట్‌ను మ‌రో 30 శాతం దాకా పెంచ‌నున్నార‌ని స‌మాచారం.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.