English | Telugu

నాగ్ వంట‌.. స‌మంత తెగ తింటోంది

హీరోయిన్లంటే.. నోరు క‌ట్టేసుకొని, తిండీ తిప్ప‌లు లేక అల్లాడిపోతార‌నుకొంటుంటాం. అయితే.. స‌మంత మాత్రం అట్టా కాద‌ట‌. దొరికింది దొరికిన‌ట్టు తెగ తింటుంద‌ట‌. ఈమ‌ధ్య స‌మంత‌కి చేప‌లంటే మ‌రీ మ‌రీ ఇష్టం ఏర్ప‌డిపోయింద‌ట‌. అదీ... `ఎన్ గ్రీల్‌` లో వండిన చేప‌. ఎన్ గ్రిల్ అంటే తెలుసు క‌దా..?? నాగార్జున‌దే ఈ హోటెల్‌. ఓసారి.. స‌మంత‌కు ఎన్ గ్రిల్ నుంచి చేప‌ల్ని పంపాడ‌ట‌. అది తిన్న స‌మంత ఫ్లాట్ అయిపోయింద‌ట‌. అప్ప‌టి నుంచి స‌మంత ఎప్పుడు హైద‌రాబాద్‌లో ఉన్న ఎన్ గ్రిల్ నుంచి చేప‌లు రావాల్సిందే న‌ట‌. స‌మంత లంచ్‌లో చేప‌లు మ‌స్ట్ అండ్ షుడ్ అట‌. ఈ చేప‌ల కూర ఖ‌రీదు దాదాపుగా రూ.4 వేల‌ని తెలుస్తోంది. ఏ సినిమా చేస్తుంటే ఆ సినిమా నిర్మాత ఈ బిల్ భ‌రించాల‌ట‌. తాను తిన‌డ‌మే కాకుండా. త‌న ఫ్రెండ్స్‌కి కూడా ఎన్ గ్రిల్ రుచుల్ని ప‌రిచ‌యం చేస్తోందట‌. వాళ్లంతా వారెవ్వా స‌మంత‌... ఏం టేస్టు నీది అంటూ కితాబుల మీద కితాబులు ఇస్తున్నార‌ట‌. ఈ ఖ‌ర్చు భ‌రిస్తున్న నిర్మాత‌లు మాత్రం... మింగ‌లేక క‌క్క‌లేక‌.. బేర్ మంటున్నార‌ని టాలీవుడ్ టాక్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.