English | Telugu

సమంతకు ఫుడ్ పాయిజన్ - ఇంకా ఎన్నో కష్టాలు


సినిమాలో కష్టాలు వచ్చినట్లు నటించే సమంతకు నిజ జీవితంలో ఎప్పుడు లేనన్ని కష్టాలు ఒకే రోజు వచ్చి పడ్డాయట. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఫుడ్ పాయిజన్ అయి ఆరోగ్యం పాడయిన సమంతకు ఒకటి మీద ఒకటిగా కష్టాలన్నీ దాడి చేసాయట. ఆరోగ్యం పాడయి అలసటగా వున్న సమంత తన బ్యాగు కూడా పోగొట్టుకుందట. అంతే కాదు అంజాన్ ఆడియో ఫంక్షన్ కోసం బయలుదేరిన ఆమె ఫ్లయిట్ డిలే అవటంతో ప్రయాణం కూడా క్యాన్సిల్ అయిందట. ఇన్ని కష్టాలు ఒకేసారి దాడి చేసే సరికి ఎవరైనా ఏంచేస్తారు, బాధను వెల్లబోసుకోవడం తప్ప. అందుకే, సమంత తన బాధను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.


ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.