ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఉన్న పేర్లు నిజమేనా!
తమిళంలో టెలికాస్ట్ అవుతున్న'గౌరీ'(Gowri)అనే సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి 'నందిని'(Nandini). ఈ సీరియల్ లో దుర్గ, కనక అనే డ్యూయల్ రోల్ లో ఆమె ప్రదర్శిస్తున్న నటనకి ఫిదా కానీ తమిళ బుల్లితెర ప్రేమికులు లేరంటే అతిశయోక్తి కాదు. కన్నడ లోను జీవ హెవాగిడే, సంఘర్ష, మధుమగలు, నీనడే వంటి ఫేమస్ సీరియల్స్ లో కనిపించి కన్నడ టీవీప్రేక్షకులని కూడా మెప్పిస్తూ వస్తుంది. అటువంటి నందిని ఆకస్మిక మరణం ఇప్పుడు ఎంటైర్ దక్షిణ టీవీ ఇండస్ట్రీ వర్గాలని ఉలిక్కి పాటుకి గురి చేస్తుంది.