English | Telugu

హెట్ స్టోరీ-2 సినిమా బ్యాన్‌కు డిమాండ్


హెట్ స్టోరీ-2 హిందీ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో జెడిఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో వున్న దృశ్యాలు నేరాలను పురికొల్పే విధంగా వున్నాయని వారు వాదించారు. హేట్ స్టోరీ-2 సినిమాలో సీన్లు అవివేకులపై ప్రభావం చూపించి స్త్రీల మీద దాడి చేసే ఆలోచనలు కలిగించే విధంగా వున్నాయని, అందుచేత సినిమా ప్రదర్శన నిలిపివేయాలని వైఎస్ వి దత్తా కోరారు.
సినిమా చూసి ఆ విషయం గురించిన రిపోర్టు అందించాల్సిందిగా ఆ రాష్ట్ర హోం మత్రి కేజే జార్జ్ పోలీసులును ఆదేశించారు.


విశాల్ పాండ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈనెల 18న విడుదల అయ్యింది. ఈ సినిమాలో సుషాంత్ సింగ్, సుర్వీన్ చావ్లా, జయ్ భానుశాలి ముఖ్య పాత్రలు నటించారు. ఇంటర్ నెట్లో విశేష ఆదరణ పొందిన సన్నీలియోన్ 'పింక్ లిప్స్' పాట ఈ చిత్రంలోనిదే.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.