English | Telugu
సలోనీ పోలీసాఫీసర్ గా "తెలుగమ్మాయి"
Updated : Mar 16, 2011
ఈ "తెలుగమ్మాయి" చిత్రంలో తన పాత్ర చాలా శక్తివంతమైనదనీ, ఆడాళ్ళని ఏడిపించే అల్లరి చిల్లరి కుర్రాళ్ళ పనిబట్టే పోలీసాఫీసర్ పాత్రనీ సలోనీ తెలిపింది. ఈ పోలీసాఫీసర్ పాత్రలో తన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటోంది సలోనీ. ఈ "తెలుగమ్మాయి" చిత్రంలోని తన పాత్ర తనకు ఒక మంచి నటిగా ఇమేజ్ ని ఇస్తుందని కూడా సలోనీ ఆశపడుతోంది. ప్రస్తుతం సలోనీ హీరోయిన్ గా నటిస్తున్నఈ "తెలుగమ్మాయి" చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.