English | Telugu

దేవీ రెడీ పాటకు సల్మాన్ ఆట

దేవీ పాటకు సల్మాన్ ఆట. విషయమేమిటంటే మన తెలుగు సినీ సంగీత యువతరంగం దేవీ శ్రీ ప్రసాద్ "ఆర్య-2" చిత్రం కోసం కంపోజ్ చేసిన "రింగ రింగ రింగ రింగ" పాట బాలీవుడ్ చిత్రంలో వినిపించబోతోంది. తెలుగులో రామ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ "రెడీ"ని హిందీలో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ హిందీ రెడీలో హీరోగా హిందీ కండల కాంతారావు అదేనండీ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.

ఈ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నహిందీ"రెడీ" చిత్రంలో "ఆర్య-2" చిత్రంలోని "రింగ రింగ రింగ రింగ" అనే ఐటం సాంగ్ ని పెడుతున్నారట. ఈ "రింగ రింగ రింగ రింగ" పాటకు సల్మాన్ ఖాన్ ఆటాడుతున్నాడట. అదేనండి డ్యాన్స్ చేస్తున్నాడట. ఒకప్పుడు హిందీ పాటలను మనవాళ్ళు కాపీ కొట్టేవాళ్ళు. ఆ స్థాయి నుంచి మన పాటలను హిందీ వాళ్ళు కాపీకొట్టే స్థాయికి మన సంగీతం ఎదిగినందుకు, అదీ మన తెలుగు కుర్రాడు దేశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట అయినందుకూ మనం గర్వపడాలి..ఏమంటారు...?

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.