English | Telugu

నాగార్జున ఢమరుకం స్విట్జర్ ల్యాండ్ లో

నాగార్జున "ఢమరుకం" చిత్రం స్విట్జర్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం "ఢమరుకం". ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను కేటాయించారట. యువసామ్రాట్ నాగార్జున సినీ జీవితంలో ఇంతవరకూ ఇంత పెద్ద బడ్జెట్ చిత్రం ఇంతవరకూ రాలేదు. ఆ ఘనత దక్కించుకున్న చిత్రంగా "ఢమరుకం" గా చెప్పవచ్చు.


ఈ "ఢమరుకం" చిత్రంలోని ఒక పాట షూటింగ్ కోసం హీరో నాగార్జున, హీరోయిన్ అనుష్క స్విట్జర్ ల్యాండ్ వెళ్ళారు. స్విట్జర్ ల్యాండ్ లో రాజు సుందరం కొరియోగ్రఫీలో, హీరో నాగార్జు, హీరోయిన్ అనుష్కలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ "ఢమరుకం" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు ఈ చిత్రానికి కెమెరామేన్ గా పనిచేస్తున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.