English | Telugu
200కోట్ల సినిమా అట్టర్ ఫ్లాప్!!
Updated : Nov 18, 2015
సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయో బాలీవుడ్ లో రికార్డ్ లు సృష్టిస్తుంటే..తెలుగు లో మాత్రం రిలీజైన థియేటర్లలో ఆడియన్స్ లేక వెలవెలబోతున్నాయి. హిందీలో మొదటి ఐదు రోజుల్లో 200కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసిన ఈ సినిమా..ఇక్కడ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తెలుగులో ప్రేమ్ లీలా పేరుతో వచ్చిన ఈ సినిమాకి రామ్ చరణ్ వాయిస్ తో వచ్చిన ప్రేమ్ లీల ట్రైలర్ లు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీ చూడాల్సిందే అన్న ఉత్సాహాన్నిచ్చాయి. అయితే చరణ్ ఎంత చేసినా ఆశించిన స్థాయిలో జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయారు. బాలీవుడ్ లో 200కోట్లు వసూళ్ళు చేసిన సినిమా..ఇక్కడ మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. అదీ మ్యాటరు!!