English | Telugu

ప్చ్‌.. పూరిని ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు!

మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌.. పూరి జ‌గ‌న్నాథ్‌. త‌న‌దైన రోజున దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే సినిమాల్ని అందించే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. అయితే గ‌త కొంత‌కాలంగా పూరికి గ‌డ్డు ప‌రిస్థితి న‌డుస్తోంది. తీసిన ప్ర‌తి సినిమా బొక్క బోర్లా ప‌డుతోంది. ఎన్టీఆర్ తో చేసిన టెంప‌ర్ కూడా.. అనుకొన్నంత విజ‌యం సాధించ‌లేదు. దానికి తోడు జ్యోతిల‌క్ష్మి డిజాస్ట‌ర్‌తో పూర్తిగా మునిగిపోయాడు. వ‌రుస ఫ్లాపుల దృష్ట్యా పూరి బ‌య్య‌ర్ల న‌మ్మ‌కాన్ని పూర్తిగా కోల్పోయాడు. పూరి సినిమా అంటే.. బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు.

ఎప్పుడు గొప్ప‌గా ఆలోచిస్తాడో, ఎప్పుడు చెత్త‌గా సినిమా తీస్తాడో చెప్ప‌లేని ప‌రిస్థితి. దాంతో.. తాజా సినిమా `లోఫ‌ర్‌`పై ఫిల్మ్‌న‌గ‌ర్ లో ఎవ్వ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. బ‌య్య‌ర్లు కూడా ఈ సినిమాని లైట్ తీసుకొంటున్నారు. నైజాంలో ఈ సినిమాని రూ.7 కోట్లకు పై చిలుకు రేటుకు అమ్మేశార‌ని టాక్ వినిపిస్తున్నా.. అదంతా ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయ‌డానికే అని తెలుస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ట్రైల‌ర్ చూసి అంద‌రూ పెద‌వి విరుస్తున్నారు. పూరి స్టైల్ మెరుపులేవీ ఈ సినిమాలో క‌నిపించ‌లేద‌ని, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి - ఏక్ నిరంజ‌న్ - చిరుత సినిమాలు గుర్తొస్తున్నాయి త‌ప్ప‌.. కొత్త‌ద‌నం ఏమీ లేద‌ని తేల్చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో లోఫ‌ర్‌కి బిజినెస్ అవ్వ‌డం, ఈ సినిమాకి ఓపెనింగ్స్ ల‌భించ‌డం.. క‌ష్ట‌త‌రంగానే క‌నిపిస్తోంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే.. పూరి త‌న క్రేజ్‌ని పూర్తిగా కోల్పోవ‌ల్సివ‌స్తుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.