English | Telugu
సల్మాన్ ఖాన్ తో రాజమౌళి ఈగ సీక్వెల్...!
Updated : Apr 9, 2016
రాజమౌళికి మొట్టమొదట దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన మూవీ ఈగ. బాహుబలి కంటే ముందే, రాజమౌళి టాలెంట్ ను బాలీవుడ్ మక్కీ రూపంలో చూసి అభినందించింది. బాహుబలి భారీ హిట్ కు మక్కీ యే బేస్ వేసింది. తాజాగా రాజమౌళి ఈగ 2 తీయబోతున్నారా..? అందులో సల్మాన్ నటిస్తున్నారా..? నిజమో అబద్ధమో తెలీదు గానీ, ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఈ టాక్ నడుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సల్మాన్ భజరంగీ భాయ్ జాన్ కు స్టోరీ అందించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాతోనే సల్మాన్ విజయేంద్రప్రసాద్ ల మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడింది. త్వరలోనే ఈగ 2 కథ రెడీ చేస్తున్నానని విజయేంద్రప్రసాద్ ప్రకటించారు. దాంతో స్వయంగా సల్మానే, ఈగ సీక్వెల్లో నటిస్తానని అడిగాడని సమాచారం. ఎలాగూ ఇకనుంచీ రాజమౌళి సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజవుతాయి కాబట్టి, సల్మాన్ ను పెట్టి సీక్వెల్ తీసి, అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసే ఆలోచన కూడా రాజమౌళికి ఉందట. కానీ సినిమాలో సల్మాన్ ను తక్కువ సేపు ఉండే హీరోగా తీసుకుంటారా, లేక సినిమా అంతా విలన్ గా చూపిస్తూ కొత్త ప్రయోగం ట్రై చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, జక్కన్న అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం..