English | Telugu
హృతిక్ రోషన్ రిలీజ్ డేట్ ప్రకటించేశాడు..!
Updated : Apr 9, 2016
బాలీవుడ్ లో ప్రెస్టేజియస్ గా తెరకెక్కుతోంది హృతిక్ రోషన్, అశుతోష్ గోవారికర్ మూవీ. ఆల్రెడీ గతంలో హృతిక్ తో జోథా అక్బర్ ను అశుతోష్ తెరకెక్కించాడు. ఇప్పుడు మరో చారిత్రక మూవీని తీస్తుండటం, ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సినిమా పేరు మొహంజాదారో. ఇది ఊహాజనిత చారిత్రక చిత్రం. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం, మొహంజదారో నాగరికత విలసిల్లినప్పుడు, ఆ కాలంలోని ఒక జంట మధ్య కలిగిన ప్రేమకథే ఈ మొహంజాదారో. బాహుబలిని దాటాలనే ఉద్దేశంతో చాలా భారీగా తెరకెక్కించిన మూవీ ఇది. మూడేళ్ల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసి, ఏడాదిన్నరగా షూట్ చేసి లెటెస్ట్ గా షూటింగ్ ను ముగించారు. లాస్ట్ షాట్ లో హృతిక్, అశుతోష్ కలిసి రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అశోతోష్ గోవారికరే సినిమా నిర్మాతగా వ్యవహరించాడు. హృతిక్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మొహంజదారో రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 గా ఫిక్స్ చేశారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమా తెరకెక్కడం విశేషం.