English | Telugu

బీకీపింగ్ కి రెడీ అయిన సాయిపల్లవి..అవార్డ్స్ కంటే ప్రేక్షకులే ముఖ్యం  

స్టార్ హీరోయిన్ 'సాయిపల్లవి'(Sai Pallavi)గత ఫిబ్రవరిలో 'తండేల్'(Thandel)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో హిందీలో 'రామాయణ' మూవీ చేస్తుంది. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించే సాయిపల్లవి 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లిగా కనపడుతుండటంతో ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్(Ranbir Kapoor)రాముడిగా కనిపిస్తున్నాడు.

సాయి పల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు అవార్డులు కన్నా ప్రేక్షకుల ప్రేమని గెలుచుకోవడమే ముఖ్యం. ఒక క్యారక్టర్ ని ఎంచుకునేటప్పుడు అందులోని లోతెంత, బలమైన భావోద్వేగం ఉందా లేదా, చూసుకుంటాను. సదరు క్యారక్టర్ ద్వారా నిజాయితితో కూడిన కథని ప్రేక్షకులకి అందేలా చెయ్యాలని తపన పడుతుంటాను. ఆ విధంగా నేను అనుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే అదే గొప్ప విజయంగా భావిస్తాను. ఆ తర్వాత అవార్డులు అనేవి బోనస్. అందుకే అవార్డులకన్నా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి తొలి ప్రాధాన్యమిస్తుంటాను. ప్రస్తుతం బీకీ పింగ్ (తేనెటీగల) పెంపకం పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఈ కొత్త హాబీ ద్వారా ప్రకృతితో మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

2015 లో 'ప్రేమమ్' అనే మలయాళ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఇప్పటి వరకు తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో కలిపి సుమారు 17 చిత్రాలదాకా చేసింది. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్(Film Fare Awards)తో పాటు పలు అవార్డ్స్ గెలుచుకుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.