English | Telugu

మహాభారతంపై అమీర్ ఖాన్ కీలక వ్యాక్యలు..మన రక్తంలోనే అది ఉంది  

స్టార్ హీరో అమీర్ ఖాన్(aamir Khan)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మహాభారతాన్ని(Mahabharatam)నిర్మించాలనేది నా కల. భారతీయులుగా మన రక్తంలోనే ఈ కథ ఉంది. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో తెరకెక్కించాలి ఈ ప్రాజెక్ట్ తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నానని చెప్పిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమీర్ మరోసారి 'మహాభారతం' మూవీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతు మహాభారతాన్ని నేటి తరానికి అందించాలనేది నా లక్ష్యం. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలని అనుకుంటున్నాను. రైటింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో దీన్ని చూపించలేం కాబట్టి సిరీస్ లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో మంది దర్శకులు వర్క్ చేస్తున్నారు. స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత, క్యారెక్టర్స్ కి ఎవరు సరిపోతారో వాళ్ళని ఎంపిక చేస్తాం. నేను ఇందులో నటిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు.


భారతీయ చిత్ర పరిశ్రమతో అమీర్ ఖాన్ కి నాలుగున్నర దశాబ్దాలపైనే అనుబంధం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా సత్తా చాటిన అమీర్, ఉత్తమాభిరుచి గల సినిమాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు సుమారు 70 చిత్రాల దాకా చేసాడు. వీటిల్లో ఎక్కువ భాగం విజయవంతమైన చిత్రాలే. ఇండియన్ చిత్ర సీమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ కూడా అమీర్ నటించిన దంగల్(Dangal)నే. భారత ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక అవార్డ్స్ పద్మశ్రీ(Padma shri)పద్మభూషణ్(Padma bhushan)కూడా అమీర్ అందుకోవడం జరిగింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.