English | Telugu

మహేష్ బాబుకి ఈడీ నోటీసులు!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి సూర్య, సురానా డెవలపర్స్ వంటి పలు సంస్థలకి ప్రమోటర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది.

ఈ రెండు సంస్థల నుంచి యాడ్స్ కోసం మహేష్ రూ.3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.