English | Telugu

అల్లు అర‌వింద్‌, దిల్ రాజుల‌కు షాక్ ఇచ్చిన పిల్ల‌..

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా.. పిల్లా నువ్వు లేని జీవితం. కొత్త హీరో అయినా, మెగా బ్యాక్ గ్రౌండ్ ఉండ‌డంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చాయి. తొలి ప‌ది రోజుల్లో దాదాపుగా రూ.10 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈరోజుల్లో అన్నీ మూడు రోజుల సినిమాలే. సినిమా ఎంత బాగున్నా.. ప‌దిరోజుల‌కు మించి ర‌న్ అవ్వ‌డం క‌ష్టం. ఆలెక్క‌న పిల్లా నువ్వు లేని జీవితం మ‌హా అయితే మ‌రో రెండు కోట్లు వసూలు చేయొచ్చు. శాటిలైట్‌తో క‌లిపి ఈసినిమాకి రూ.14 కోట్లు వ‌స్తాయేమో..?! ఆ లెక్క‌న చూసుకొన్నా ఈ సినిమాకి న‌ష్టాలు త‌ప్ప‌వంటున్నారు ట్రేడ్ వ‌ర్గాలు. ఎందుకంటే ఈ సినిమాకి దాదాపుగా రూ.18 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ట‌. శ్రీ‌హ‌రికే మూడు కోట్లు ఇచ్చార‌ట‌. ఆయ‌న మ‌ర‌ణంతో మ‌ళ్లీ సినిమాలో కొంత భాగం రీషూట్ చేయాల్సివ‌చ్చింది. దానికితోడు జ‌గ‌ప‌తిబాబుని రీప్లేస్ చేయ‌డానికి దాదాపు రూ.కోటి రూపాయ‌లు వ‌దిలాయి. ఆర్టిస్టుల‌కు పేమెంట్స్ డ‌బుల్ అయ్యాయి. అందుకే ఈ సినిమాకి పాజిటీవ్ టాక్ వ‌చ్చినా.. న‌ష్టాలు త‌ప్ప‌లేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దిల్‌రాజు, అల్లు అర‌వింద్ ఇద్ద‌రూ ప్లానింగ్‌లో దిట్టే. కానీ అలాంటి వాళ్ల‌కూ సినిమా షాక్ ఇవ్వ‌గ‌ల‌ద‌ని ఈ పిల్ల నిరూపించింది. ఏం చేస్తాం... టైమ్ బ్యాడ్ అంతే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.