English | Telugu

నాగ్‌... చుక్క‌లు చూపిస్తున్నాడు

వార‌సుల సినిమా అంటే ద‌ర్శ‌కులు జ‌డుసుకొంటున్నారు. కార‌ణం.. డాడీల ప్ర‌మేయం ఓ రేంజ్‌లో ఉంటోంది.చ‌ర‌ణ్ సినిమా అన‌గానే చిరు ఎలెర్ట్ అయిపోయి క‌రెక్ష‌న్లు చెప్పేస్తుంటారు. ఇప్పుడు అఖిల్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. అఖిల్ ఎంట్రీ మూవీ విష‌యంలో నాగ్‌... అంద‌రికీ చుక్క‌లు చూపిస్తున్నాడు. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సిసింద్రీ అఖిల్ ఎంట్రీ ఖాయ‌మైనా, ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా ప‌ట్టా లెక్క‌లేదు. క‌థ ప‌క్కాగా లేక‌పోతే.. ఈ సినిమా నేను చేయ‌ను అని నాగ్ ముందే ఓ కండీష‌న్ పెట్టాడ‌ట‌. స్ర్కిప్ట్ చేతిలో పెడితే గానీ.. గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ‌ద‌ని వినాయ‌క్ కూడా డిసైడ్ అయ్యాడు. అందుకే ముందు స్ర్కిప్ట్ పై ప‌డ్డాడు. సింగిల్ లైన్ స్టోరీ చెప్పిన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 3 నెల‌లు గ‌డిచాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమా మొద‌ల‌వ్వ‌లేదు. దానికి కార‌ణం నాగార్జున అతి జాగ్రత్తే అని తేలింది. అఖిల్ సినిమా విష‌యంలో నాగ్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ట‌. సీన్ బై సీన్ డిస్క‌ర్స్ చేస్తున్నాడ‌ట‌. ఇదంతా వినాయ‌క్‌కి కొత్త‌గా అనిపిస్తోంది. ఎందుకంటే వినాయ‌క్ ఓ స్టార్ డైరెక్ట‌ర్‌. తాను చెప్పింది హీరో చేసుకొంటూ పోవ‌డ‌మే త‌ప్ప‌... మ‌ధ్య‌లో దూరి క‌రెక్ష‌న్లు చెప్పిన వాళ్లు లేరు. నాగ్ మాత్రం ప్ర‌తీ విష‌యంలోనూ క‌ల‌గ చేసుకోవ‌డంతో వినాయ‌క్‌కి త‌ల‌నొప్పిగా త‌యారైంది. నాగ్ ని మెప్పించాల‌ని క‌సిగా ప‌నిచేస్తున్నా.. నాగ్ క‌రెక్ష‌న్లు చెప్ప‌డం మాన‌డం లేద‌ట‌. ఈ స్కిప్టు ఎప్ప‌టికి పూర్త‌వుతుందో, సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో అంటూ అక్కినేని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నాగ్ భాయ్‌... చుక్క‌లు చూపిస్తున్నాడ‌న్న‌మాట‌.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.