English | Telugu

సూర్యతో సుప్రీమ్ కు పోటీనా..?

వైవిధ్యమైన సినిమాగా తెరకెక్కి భారీ అంచనాల మధ్య రిలీజైంది సూర్య 24. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సూర్యకు పోటీగా వస్తుండటంతో, సినిమా చాలా బాగుంటే తప్ప కష్టం అనుకున్నారు జనాలు. కానీ సాయి కూడా తన రేంజ్ పెంచుకుని, కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ ను సుప్రీంకు సాధించాడు. రిలీజైన తర్వాత బాక్సాఫీస్ ను పరిశీలిస్తున్న ట్రేడ్ పండితులు, సూర్య సినిమా వల్ల సుప్రీమ్ కు ఎలాంటి నష్టమూ ఉండదని తేల్చేస్తున్నారు. రెండింటికీ మధ్య జానర్లో చాలా వ్యత్యాసం ఉండటమే అందుక్కారణం. సూర్య సినిమా కంప్లీట్ సైఫై గా సిటీస్, మల్టీప్లెక్స్ జనాలను రప్పిస్తుంటే, సుప్రీమ్ పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా బి,సి సెంటర్ల ఆడియన్స్ ను అలరిస్తోంది. అందువల్ల రెండు సినిమాలకూ మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఎవరి ఆడియన్స్ వాళ్లకు ఉండటంతో, సాయి ధరమ్ అండ్ కో నిశ్చింతగా ఉన్నారు. మరో వైపు సూర్య సినిమా కూడా, అన్ని వైపులా మంచి టాక్ తో దూసుకుపోతోంది. సాయి, సూర్య ఇద్దరూ కూడా లాభాలతోనే సమ్మర్ ను దాటుతారని అంచనా వేస్తున్నారు సినీజనాలు. 20 వ తారీఖున బ్రహ్మోత్సవం వచ్చేవరకూ బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సినిమా లేని కారణంగా, వీటి రన్ కు ఎలాంటి అడ్డూ కనిపించడం లేదు. మరోవైపు సుప్రీం సాయిధరమ్ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్లతో నిలుస్తుందని అంచనా..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.