English | Telugu

నేడే బ్రహ్మోత్సవం ఆడియో విడుదల..!

చాలా రోజులుగా మహేష్ బాబు అభిమానులను ఊరిస్తున్న బ్రహ్మోత్సవం ఆడియో వేడుక ఈరోజు జేఆర్సీ కన్వెన్షన్లో జరగబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, బయటి రాష్ట్రాల నుంచి కూడా మహేష్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కు వస్తారని సమాచారం. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంతమంది అభిమానులకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లు కల్పించడానికి పివిపి సినిమా సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎంట్రీ పాస్ లు కూడా లెక్కగానే ఇస్తున్నారు. ప్రతీ స్టార్ హీరో ఆడియో ఫంక్షన్లో ఇది జరిగేదే అయినా, ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమ్మర్ కు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న బ్రహ్మోత్సవం పై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న మహేష్ అండ్ కో, ఆడియో విడుదల సందర్భంగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా పుకార్లు వచ్చిన నేపథ్యంలో, మహేష్ బాబు ఏం మాట్లాడతారనే దానిపై జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.